ETV Bharat / state

విశాఖ సాగర తీరంలో యువకుల సర్ఫింగ్ విన్యాసాలు.. - విశాఖ రుషికొండ బీచ్ లో సర్ఫింగ్ క్రీడలు

విశాఖ సాగర తీరంలో అలలపై దూసుకుపోతూ సర్ఫర్లు సందడి చేస్తున్నారు. ఆకర్షణీయమైన తీరానికి మరింత అందాన్ని జోడిస్తున్నారు. విశాఖ సాగరతీరానికి ఉన్న సానుకూలత సర్ఫింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుందని.. చెబుతున్నారు.

surfing
సర్ఫింగ్ విన్యాసాలు
author img

By

Published : Apr 7, 2021, 7:27 AM IST

సర్ఫింగ్ విన్యాసాలు

విశాఖ రుషికొండ బీచ్.. సర్ఫింగ్ క్రీడాకారుల్ని ఆకర్షిస్తోంది. తూర్పు తీరంలో ఇలాంటి క్రీడకు అవకాశం ఉన్న కొద్ది ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న రుషికొండ తీరాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకుంటున్నారు. విదేశాల్లో ఎంతో ఆదరణ కలిగిన ఈ సాగర క్రీడ విశాఖ యువతకు చేరువైంది. అనుదీప్ ఆండీ శిక్షణా సారథ్యంలో ఎక్కువగా మత్స్యకార యువత సర్ఫింగ్ లో సత్తా చాటుతున్నారు.

అలలపై నిలబడి తీరం వైపుగా కదలడం... ఆ సమయంలో తీర ప్రాంత అందాలను ఆస్వాదించడం గొప్ప అనుభూతి అని యువ సర్ఫింగ్ క్రీడాకారులు అంటున్నారు. ఈ క్రీడ నేర్చుకోవడం ద్వారా తమ భవిష్యత్తుకి ఓ భరోసా దొరికిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సర్ఫింగ్.. శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడుతుందని.. ఒత్తిడిని అధిగమించడానికి దోహదం చేస్తుందని.. క్రీడాకారులు అంటున్నారు. రుషికొండ తీరంలో ప్రమాదం బారిన పడిన వారిని కాపాడడంలోనూ ఇక్కడి సర్ఫర్లు ముందుంటున్నారు.

ఇదీ చదవండీ.. పిల్లలమర్రికి పునరుజ్జీవం.. ఆ మహావృక్షం మాత్రం శిథిలావస్థకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.