ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలకు.. విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు - Tungabhadra Pushkar latest news update

తుంగభద్ర పుష్కరాలకు విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. భక్కుల రద్దీ దృష్ట్యా సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా నియమాలు పాటిస్తూ బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

Special buses from Visakhapatnam to kurnool
తుంగభద్ర పుష్కరాలకు విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు
author img

By

Published : Nov 22, 2020, 12:11 PM IST

పుష్కర స్నానాలు ఆచరించే భక్తుల కోసం కర్నూలు జిల్లాకు ‘తుంగభద్ర పుష్కర స్పెషల్‌’ పేరుతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 30 మంది ప్రయాణికులతో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ నుంచి మొదటి సర్వీసు బయలుదేరింది. శుక్రవారం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ స్పందన లేకపోవడం, టిక్కెటు ధర ఎక్కువగా ఉండటం ఆయా బస్సుల్లో ప్రయాణించేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆ బస్సులను రద్దు చేశారు. ప్రస్తుతం టిక్కెట్‌ ధర పెద్దలకు రూ.1240, పిల్లలకు రూ.655గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న ప్రయాణికులు టిక్కెట్లను www.apsrtc.online.inలో బుక్‌ చేసుకోవచ్చు, ద్వారకా బస్‌ స్టాండ్‌లోనూ తీసుకోవచ్ఛని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రెండు బస్సులను అందుబాటులో ఉంచగా అవి నిండిన తరువాత మరో రెండింటిని అందుబాటులో ఉంచనున్నారు.

మధ్యాహ్నం 2.15 విశాఖలో బయలుదేరే బస్సు మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కర్నూలు బస్‌ స్టాండ్‌కు చేరుకుంటుంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా కర్నూలుకే బస్సులు చేరుకుంటాయని డిప్యుటీ సీటీఎం కణితి వెంకటరావు తెలిపారు. రద్దీ మేరకు రోజూ రెండు, మూడు బస్సులు నడుపుతామన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు ప్రకారం బస్సుల్లో శానిటైజేషన్‌ చేస్తూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇవీ చూడండి:

వెదురు కర్రే విద్యుత్ స్తంభం.. కూలితే ప్రమాదమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.