సైబర్ నేరాలు అరికట్టడం, మహిళల రక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీనిద్వారా ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా నోడల్ అధికారులుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ రాహుల్ సింగ్, అనకాపల్లి డీఎస్పీ శ్రావణిలను నియమించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం, పర్యవేక్షణ బాధ్యతను వీరు చూడనున్నారు.
ఇవీ చదవండి...