రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలకు పెద్ద పీఠ వేస్తూ సామాజిక న్యాయం పాటిస్తూ పాలన సాగిస్తున్నారని మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు తెలిపారు. అమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మంత్రికి పాయకరావుపేటలో వైకాపా మత్స్యకార సంఘం నాయకులు చోడిపల్లి శ్రీను ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని మంత్రి వివరించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి