కోర్టు భవనాల నిర్మాణ పనులు సకాలంలో సత్వరమే పూర్తయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యతను న్యాయాధికారులు, న్యాయవాదులు స్వీకరిస్తే మంచిదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ సూచించారు. విశాఖ జిల్లా చోడవరంలో రూ.19.54 కోట్లతో నిర్మించనున్న 4కోర్టుల భవన సముదాయం పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. కోర్టు ఆవరణలో విశాఖపట్నం జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయాధికారులు, చోడవరం న్యాయవాదులతో హైకోర్టు న్యాయమూర్తి సమావేశమయ్యారు. పనుల్లో జాప్యమైతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. సమావేశంలో హైకోర్టు రిజిస్ట్రార్ డి.రమణ, జిల్లా జడ్జి ఎ.హరిహరనాథశర్మ, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి: డీడీఆర్‌పీ ఛైర్మన్