విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని 22వ వార్డులో... రెడ్డి శ్రీదేవి అనే మహిళ హత్యకు గురైంది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు ఏడేళ్లుగా దూరంగా ఉంటున్న ఆమె.. మురళి అనే మరో వ్యక్తితో నర్సీపట్నంలో ఉంటున్నట్టు సమాచారం. సన్నీ అనే మరో వ్యక్తితో దేవికి సంబంధం ఉన్నట్టు మురళి అనుమానించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో దేవిని మురళి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: