ETV Bharat / state

బాలికపై.. బావ లైంగికదాడి - విశాఖ జిల్లా ఈరోజు క్రైమ్​ తాజా వార్తలు

సొంత బావ.. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన విశాఖలోని రెండోపట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. అనారోగ్యంగా ఉన్న యువతిని.. వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చటంతో.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

sexually harrasment
మైనర్​ బాలికపై సొంత బావ లైంగికదాడి
author img

By

Published : Nov 25, 2020, 11:35 AM IST

నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ బాలిక (15)పై సొంత బావే లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నిందితుడు బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడంతో యువతిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు కుటుంబీకులు తీసుకువెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు గర్భం దాల్చినట్లు తేల్చారు. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. దిశ పోలీసు స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని మంగళవారం జైలుకు తరలించారు.

ఫిర్యాదు ఇవ్వకపోయినా....

యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది సొంత అత్త కొడుకే కావడంతో బాధితురాలు ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి కూడా నిరాకరించినట్లు సమాచారం. మైనర్‌ అనుమతి ఉన్నప్పటికీ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టప్రకారం నేరమన్న కోణంలో.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

ఇవీ చూడండి:

చెరువు ఆక్రమణ: పరిశీలించిన సబ్​ కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.