ETV Bharat / state

విశాఖ జిల్లాలో రెండో విడత ‘సిరో సర్వేలెన్స్‌ సర్వే’

విశాఖ జిల్లాలో రెండో విడత ‘సిరో సర్వేలెన్స్‌ సర్వే’ నిర్వహిస్తున్నారు. ఎంత మందికి సోకింది.. వచ్చినా తెలియకుండా ఎంతమందికి నయమైంది.. తదితర విషయాలను గుర్తించడానికి ఈ సర్వే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,500 మంది నుంచి నమూనాలు సేకరించనున్నారు. జిల్లాను నాలుగు విభాగాలుగా విభజించి ఈ సర్వే చేస్తున్నారు

sero Surveillance Survey' in Visakhapatnam District
విశాఖ జిల్లాలో రెండో విడత ‘సిరో సర్వేలెన్స్‌ సర్వే’
author img

By

Published : Nov 5, 2020, 1:10 PM IST

విశాఖ జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లోనూ 90 శాతం లక్షణాలేవీ కనిపించడం లేదు. వ్యాధినిరోధక శక్తి బాగా ఉన్నవారికి ఈ వ్యాధి సొకి తెలియకుండానే తగ్గినట్లు గత సర్వేలోనే తేలింది. విశాఖ జిల్లాలో కరోనా వైరస్‌ ఎంత మందికి సోకింది.. వచ్చినా తెలియకుండా ఎంతమందికి నయమైంది.. తదితర విషయాలను గుర్తించడానికి జిల్లాలో రెండో విడత ‘సిరో సర్వేలెన్స్‌ సర్వే’ నిర్వహిస్తున్నారు. జిల్లాలో తొలి విడత సర్వే ద్వారా 20.7 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు అధికారులు గుర్తించారు. రెండో విడత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో యాంటీబాడీస్‌ ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఆరు రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నారు.

జిల్లాను నాలుగు విభాగాలుగా విభజించి ఈ సర్వే చేస్తున్నారు. ఏపీ కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఆదేశాల మేరకు ఈనెల 4వ తేదీ నుంచి 10 వరకు ఈ సర్వే జరగనుంది. అర్బన్‌ మిడ్‌, రూరల్‌ హై, రూరల్‌ మిడ్‌, రూరల్‌గా జిల్లాను నాలుగు భాగాలుగా విభజించారు.

జిల్లాలో 4,500 మంది నుంచి రక్త నమూనాలను సేకరించనున్నారు. అందులో 3,150 మంది సాధారణ ప్రజలు, 1,350 మంది హైరిస్క్‌ ప్రజల నుంచి ఈ నమూనాలను తీసుకుంటారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు వైరస్‌ బారినపడని వారితో పాటు వైరస్‌ నుంచి కోలుకున్న వారి నుంచి నమూనాల తీసుకుని ప్రత్యేక బార్‌కోడ్‌తో చెన్నైలోని ప్రయోగశాలకు పంపించి ఫలితాలను విశ్లేషించనున్నారు.

నమూనాల సేకరణ వ్యూహం ఇలా..

  • సేకరించినున్న నమూనాలు : 4,500
  • పట్టణ ప్రాంతాల్లో : 1,700
  • గ్రామీణంలో మద్యస్తంగా నమోదైన ప్రాంతాల్లో : 800
  • గ్రామీణంలో తక్కువ కేసులు నమోదైన చోట : 2,000

ఏ రోజు.. ఎక్కడ సర్వే..

  • గురువారం అనకాపల్లి, చోడవరం, మాకవరపాలెం మండలాల్లో 600 మంది నుంచి నమూనాలు తీసుకుంటారు.
  • శుక్రవారం ఎలమంచిలి, నర్సీపట్నం, పరవాడా, పెందుర్తి, పాయకరావుపేట పరిధిలో 1300 మంది నుంచి నమూనాలు సేకరిస్తారు.
  • ఈనెల 9న మాడుగుల, కశింకోట, కోటవురట్ల పరిసర ప్రాంతాల్లో సర్వే జరుగుతుంది.
  • ఈనెల10న పధ్మనాభం, మునగపాక మండలాల్లో 800 మంది నుంచి నమూనాలు సేకరించనున్నారు.

సర్వే తరువాతే వైరస్‌పై అంచనా..

లక్షిత వర్గాల నుంచి 5 మి.లీ చొప్పున సేకరించిన రక్త నమూనాలను క్లియా యంత్రంతో విశ్లేషించి యాంటీబాడీలు (ఐజీజీ) ఏ స్థాయిలో ఉన్నాయి..? అభివృద్ధి చెందాయా..? వైరస్‌ ముప్పు ఇంకా పొంచి ఉందా అనే విషయమై స్పష్టతకు వస్తారు. ఈ సర్వే తరువాత ఎలాంటి వ్యూహాలను అవలంబించాలనే దానిపై భవిష్యత్తు కార్యచరణ ఉంటుంది.-డా.సూర్యనారాయణ

ఇదీ చదవండి: టిడ్కో ఇళ్లు పేదలకు భారమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.