విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం గొప్పూరులో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు... ఎస్ఈబీ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి