ETV Bharat / state

సారా బట్టీలపై దాడులు... భారీగా బెల్లం ఊట ధ్వంసం - seb officers rides in krishna district

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా, మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు.

seb-officers-rides-on-wine-manufacturing-plants-in-andhrapradhesh
సారా బట్టీలపై దాడులు
author img

By

Published : Apr 4, 2021, 4:56 PM IST

విశాఖపట్నం జిల్లాలో...

అనకాపల్లి మండలం వల్లూరు గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న వారిని త్వరలో పట్టుకుని వారిపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

కృష్ణా జిల్లాలో...

రెడ్డి గూడెం మండలం అన్నేరావుపేటలో, స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాటు సారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 8 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరులో...

నెల్లూరులోని నిప్పో సెంటర్ వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో... ఎస్ఈబీ అదనపు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణకు చెందిన 142 మద్యం సీసాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.