మార్గశిర మాస పాడ్యమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. విశాఖలోని రామకృష్ణ బీచ్ మొదలుకొని సముద్ర తీరం అంతటా సందడి నెలకొంది. కార్తిక మాసం చివర్లో అమావాస్య తర్వాత వచ్చే పోలి పాడ్యమి సందర్భంగా సముద్ర, నదీతీరాల్లో దీపాలు వదలడం ఆనవాయితీ. మహిళలు సాగర ఒడ్డున దీపాలను వెలిగించి సూర్యభగవానుడికి అంజలి ఘటించారు. రద్దీ వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కార్తికమాసం ముగింపు పూజలు