Science Exhibition in NSTL : విశాఖలోని ఎన్ఎస్టీఎల్లో రెండు రోజులపాటు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు ప్రారంభించారు. సైన్స్ సంబంధిత పరికరాలు, ఆయుధాలు, విద్యార్థుల ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు డాక్టర్ వై.శ్రీనివాసరావు తెలిపారు.
విద్యార్థుల్లో ఆవిష్కరణ, జిజ్ఞాసను పెంపొందించడమే.. ప్రదర్శన లక్ష్యమని వై.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రదర్శన తిలకించేందుకు పలు పాఠశాలలు, కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.
ఇదీ చదవండి: TDP leaders fires on CM Jagan: భారతి సిమెంట్‌పై లేని నియంత్రణ.. సినిమాపై ఎందుకు..! : చంద్రబాబు