ఇదీ చదవండి:
అనకాపల్లి డీఏవీ పబ్లిక్ పాఠశాలలో సైన్స్, ఆర్ట్స్ ఎగ్జిబిషన్
విశాఖ జిల్లా అనకాపల్లిలోని డీఏవీ పబ్లిక్ పాఠశాలలోనిర్వహించిన సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు చేసిన పరికరాలు ఆకట్టుకున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానం, రోబోట్ తయారీ వంటివి విద్యార్థులు తయారు చేసి ఈ ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి, వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు ప్రారంభించారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఆంగ్ల హిందీ భాషల ప్రాముఖ్యాన్ని తెలుపుతూ విద్యార్థులు రూపొందించిన పరికరాలు ఆకట్టుకున్నాయి.
అనకాపల్లి డీఏవీ పబ్లిక్ పాఠశాలలో సైన్స్, ఆర్ట్స్ ఎగ్జిబిషన్