ETV Bharat / state

పాఠశాల ఆటో బోల్తా, 12మంది విద్యార్థులకు గాయాలు - vishakhapatnam district crime

పాఠశాల ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కిలగడఘాటిలో జరిగింది.

School Auto Bolt in Kiligadaghatti .. 12 students with minor injuries
కిలగడఘాటిలో పాఠశాల ఆటో బోల్తా.. .12మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు
author img

By

Published : Mar 17, 2020, 1:40 PM IST

కిలగడఘాటిలో పాఠశాల ఆటో బోల్తా.. .12మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగడఘాటిలో పాఠశాల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12మంది విద్యార్థులతో పెదబయలులోని పాఠశాల నుంచి కోడపుట్టు గ్రామానికి బయలుదేరిన ఆటో కిలగాడఘాటి​ వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి బోల్తాపడింది. గమనించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ పాఠశాల యాజమాన్యం గానీ, సిబ్బంది గాని ఆస్పత్రికి రాకపోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి.

కరోనా అనుమానిత లక్షణాలతో విశాఖ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.