ETV Bharat / state

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్​ నిధులపై తీర్మానం - cpm agitation

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. భేటీలో మలేరియా, డెంగీ వ్యాధులపై చర్చ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కష్ట సమయంలో జనరల్ నిధులుగా వాడుకోవచ్చినని ఈ సమావేశంలో జీవీఎంసీ తీర్మానించింది.

GVMC
విశాఖ జీవీఎంసీ
author img

By

Published : Sep 18, 2021, 8:31 PM IST

విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. నగరంలోని పరిస్థితులతో పాటు పలు అంశాల మీద ప్రజాప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎస్‌సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై చర్చించారు. కష్ట సమయంలో సబ్ ప్లాన్ నిధులను సాధారణ నిధులుగా వాడుకోవచ్చని జీవీఎంసీ తీర్మానం చేసింది. బడుల్లో మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపై చర్చ చేపట్టగా.. వైకాపా, తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీల సభ్యులు విమర్శలు చేసుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖ జీవీఎంసీ

సీపీఎం ఆందోళన

సమావేశానికి ముందు జీవీఎంసీ గేట్‌ ఎదుట సీపీఎం నిరసన చేపట్టింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ శునకాలతో ప్రదర్శన నిర్వహించారు. మనుషులకే దిక్కులేదు కుక్కలకు పార్కు ఎందుకని ప్రశ్నించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : Harassment: భర్త, అత్త వేధిస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.