విశాఖ జిల్లా పెందుర్తి మండలం పులగానిపాలెంలో... మేకల కాపరి కుటుంబాన్ని భూకబ్జాదారులు వేధిస్తున్నారని.. ప్రగతిశీల మహిళా సంఘం ఆరోపించింది. గ్రామంలో మేకలు కాసే లక్ష్మీ, సన్యాసిరావు దంపతులు... ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలోనే ఇల్లు కట్టుకున్నారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీ చెప్పారు. అదే భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి వారిదే అని రెవెన్యూ అధికారులు తేల్చారని చెప్పారు. బాధితులతో పాటు, వారికి అండగా ఉన్న మహిళా సంఘంపైనా సదరు వ్యక్తులు అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. వాస్తవాలు పరిశీలించి... ఆ కేసులను పోలీసులు కొట్టేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 10 రోజుల్లోపే సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే కరణం