సెప్టెంబరు 21 నుంచి 'సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్' ఉద్యమం నిర్వహిస్తామని, డిసెంబర్లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చలో దిల్లీ, చలో అమరావతి కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో తెన్నేటి విశ్వనాథం ఆనాడు కృషి చేశారని వివరించారు. ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని, ఉద్యమానికి ఆనాడు కన్వీనర్‌గా వ్యవహరించిన కొల్ల రాజమోహన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
ఇది కూడా చదవండి.