మారుతున్న కాలానికి భిన్నంగా ఆచార సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విశాఖ మన్యంలోని గిరిజనులు సంక్రాంతి సంబురాలు జరుపుకొంటున్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా పది రోజుల పాటు గిరిజన సంప్రదాయ నృత్యాల నడుమ ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకొంటున్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కరోజు పండుగ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలను తమ గ్రామానికి ఆహ్వానించి వారికి విందు భోజనం ఏర్పాటు చేసి వైభవంగా పండుగ జరుపుకుంటున్నారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా సంప్రదాయ ఒరియా భాషలో పాటలు పాడుతూ హుషారుగా చిందులేస్తున్నారు.
ఇదీచదవండి: పంచాయతీ ఎన్నికలపై హౌస్ మోషన్ పిటిషన్.. రేపు విచారణ!