విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్లోని పాడి రైతులకు సంక్రాంతి బోనస్ కింద సుమారు రూ.4కోట్ల 35 లక్షలు విడుదల అయిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. వీటిని పాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సీపట్నం పాలశీతలీకరణ కేంద్రం వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో విశాఖ డైరీ కేటాయించిన సంక్రాంతి బోనస్ సొమ్మును విడుదల చేశారు.
పాడి రైతుల పిల్లలకు విద్యా, వైద్యపరంగా తదితర సేవలను అందిస్తూ.. రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో ఎంపిక చేసిన వారికి మేలు జాతి పశువులను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ రెడ్డి సూర్యనారాయణ , డైరీ మేనేజర్ సత్యనారాయణ వైకాపా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: