విశాఖ జిల్లా చోడవరంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు ట్రాక్టర్లు, లారీలో ఇసుకను అనుమతుల్లేకుండా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ విభీషణరావు తెలిపారు. అయితే పోలీసు స్టేషన్ ప్రధాన రహదారి అయిన బి-ఎన్ రహదారి పక్కనే ఉంది. ఇప్పటికే పట్టుకున్న ఇసుక నిల్వలతో స్టేషన్ గ్రౌండ్ నిండిపోయింది. దీంతో పట్టుబడిన ఇసుక వాహనాలను రహదారిపై పెట్టారు. దీనివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోంది. పట్టుబడిన ఇసుక నిల్వలను వేరేచోటకు తరలిస్తామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: దేవాలయాలకు జియో ట్యాగింగ్: గౌతం సవాంగ్