నాణ్యత లేని భవనంపై గ్రామ సచివాలయ నిర్మాణం చేపట్టడంతో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦ గుంటపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో గతంలో రూ.10 లక్షల నిధులతో పంచాయతీ భవనం నిర్మి౦చారు. కొత్తగా నిర్మించబోయే సచివాలయానికి స్థలం లేకపోవడం.. ఉన్నతాధికారులు అనుమతులు లేకుండా సచివాలయ ఇంజినీర్ ఇష్టారాజ్యంగా డిజైన్ మార్చి నిర్మాణపనులు మొదలుపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని పాతభవనంపై కొత్త భవననిర్మాణం చేస్తే భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : 'ఆ ప్రజాప్రతినిధుల కేసులకు అధిక ప్రాధాన్యం'