విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో భద్రాచలం, సీలేరు, హైదరాబాద్, అమరావతి , విజయవాడ వంటి ప్రాంతాలకు బస్సు సర్వీసులను తిరిగి నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే విజయవాడకు సంబంధించి నర్సీపట్నం నుంచి రోజు సాయంత్రం 6 గంటలకు బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సూర్య పవన్ కుమార్ తెలిపారు. అలాగే నర్సీపట్నం నుంచి విశాఖకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి నాన్ స్టాప్ సర్వీసులతో పాటు లిమిటెడ్ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతం నర్సీపట్నంలో వ్యాపార సంస్థలను రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు నడిపేందుకు.. సమయాన్ని పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై పట్టణంలో వ్యాపార సంస్థలు రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇదీ చదవండి: నేడు.. వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన