పై అధికారులు మందలించారని ఆర్టీసీ డ్రైవర్ ఆందోళనకు దిగిన ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ వైవీ. రావు విధులు నిర్వహిస్తున్న బస్సు విశాఖ నుంచి నర్సీపట్నం వచ్చే క్రమంలో గంట ఆలస్యంగా డిపోకు చేరుకుంది. దీంతో డిపో ఉన్నతాధికారులు డ్రైవర్‌ను మందలించారు. ట్రాఫిక్ కారణంగా ఆలస్యమైందని సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా అధికారులు వినిపించుకోకుండా దుర్భషలాడారని ఆరోపిస్తూ డ్రైవర్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ సూర్య పవన్ డ్రైవర్‌తో మట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు.
ఇదీచదవండి