రాష్ట్రంలోని ఇటీవల జరిగిన వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డు ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని విశాఖ జిల్లా రోలుగుంట మండలానికి చెందిన పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రోలుగుంట ఎంపీడీవో ప్రభాకరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.
రోలుగుంట మండలానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో సేవా మిత్ర , సేవ రత్న , సేవా వజ్ర కేటగిరీల కింద సుమారు 202 మందిని ఎంపిక చేశారు. తాము కూడా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని ఆ పురస్కారాలు పొందడానికి అర్హులమేనని వివిధ పంచాయతీలకు చెందిన పలువురు వారి పేర్ల జాబితాను అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రోలుగుంట ఎంపీడీవో కే. ప్రభాకర రావు వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఎన్ఆర్ఐ కుటుంబం మృతి కేసులో ట్విస్ట్.. పెద్ద కుమారుడే ఘటనకు కారణమా?