విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బోధ రాళ్ళ పంచాయతీ కుంకుం గ్రామానికి చెందిన గిరిజనలు ఎన్నోఏళ్లుగా రహదారి కోసం అధికారులు, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగారు. అయినా రోడ్డు పనులు చేపట్టలేదు. చివరికి తామే సొంతంగా రహదారి నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు.
గ్రామస్తులంతా ఏకమై.. బోయపాలెం వరకు సుమారు 3 కిలో మీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. అధికారులకు ఎన్ని సార్లు మెురపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని అందుకే సొంతంగా రోడ్డు వేసుకున్నామని గ్రామస్తులు తెలిపారు.