బ్యూటిఫుల్ సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సందడి చేశారు. చిత్ర హీరో, హీరోయిన్, కథ రచయితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యూటిఫుల్ సినిమా మంచి రొమాంటిక్ సినిమాగా తెరకెక్కించామని ఆర్జీవి అన్నారు. రంగీలా తరువాత ఆ జోనర్ లో తీసిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించటం అదృష్టంగా భావిస్తున్నామని హీరో హీరోయిన్లు తెలిపారు. కొత్తవారిని ప్రోత్సహించడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ముందుంటారని అన్నారు. జనవరి 1న విడుదలవుతున్న సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.
ఇదీ చదవండి: 'రాజధాని పక్క రాష్టంలో ఉన్నా తేడా ఏమీ ఉండదు'