ETV Bharat / state

సింహాచలం ఈవోదే ఈ మాస్టర్ ప్లాన్ - సింహాచలంపై అక్రమ క్వారీ పనులు

విశాఖ సింహాచలం కొండపై అక్రమ క్వారీయింగ్ ఆరోపణలపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఘాట్ రోడ్డుకు 250 మీటర్ల దూరంలోనే క్వారీయింగ్ చేస్తున్నారని నివేదికలో పేర్కొంది. మాస్టర్ ప్లాన్​లో లేని పనులు చేసేందుకు ఈవో అనుమతులిచ్చారని నివేదికలో వెల్లడించారు.

report submitted to government on simhachalam illegal quary works
సింహగిరులపై మాస్టర్ ప్లాన్​కి విరుద్ధంగానే పనులు జరిగాయి
author img

By

Published : Jun 3, 2020, 9:07 AM IST

Updated : Jun 3, 2020, 11:59 AM IST

విశాఖ సింహాచలం కొండపై అక్రమ క్వారీయింగ్ ఆరోపణలపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొండపై మూడు చోట్ల అక్రమంగా క్వారీయింగ్ జరిగినట్టుగా దేవాదాయ శాఖ ఎస్టేట్ అధికారి విచారణ నివేదికలో పేర్కోన్నారు. సింహాచలం ఈఓ వెంకటేశ్వరరావు ఈ అక్రమాలను ప్రోత్సహించారని నివేదికలో వెల్లడించారు. దేవాలయాల్లో కొత్తగా నిర్మాణాలు జరపొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కొత్త నిర్మాణాలపై నిషేధం ఉన్నా కొత్త టెండర్లను పిలిచారని స్పష్టం చేసింది. పనులు జరిగిపోయిన టెండర్లు పిలిచి అక్రమాలకు తెర లేపారని... అత్యంత గోప్యంగా నిర్మాణాలను చేపట్టారని వెల్లడించారు. ఘాట్ రోడ్డుకు 250 మీటర్ల దూరంలోనే క్వారీయింగ్ చేస్తున్నారని స్పష్టం చేసింది. కొత్త బైపాస్ రోడ్ నిర్మాణం, టోల్ గేట్ ఏర్పాటు పేరుతో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని నివేదికలో వెల్లడించారు.

గుర్తు తెలియని భక్తుడి పేరుతో... డొనేషన్ పద్ధతిలో బైపాస్, టోల్ గేట్ నిర్మాణం చేపట్టారని విచారణాధికారి తేల్చారు. వ్యర్ధాల తొలగింపు పేరుతో గ్రావెల్ తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. అక్రమంగా జరుగుతోన్న క్వారీయింగ్ వల్ల కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉందని, హైటెన్షన్ వైర్లు... భక్తులు, అర్చకుల మీద పడే ప్రమాదముందని నివేదికలో హెచ్చరించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లతో సంప్రదించకుండానే పనులకు అనిమతి ఇచ్చారని... అక్రమ క్వారీని చట్టబద్ధం చేసేందుకు ఈవో రికార్డులు సృష్టించే ప్రయత్నం చేశారని వెల్లడించింది.

ఇంజనీరింగ్ విభాగంతో సంప్రదించకుండా గిరిజన కాటేజీల నుంచి ఆలయం వరకు రోడ్ నిర్మాణ పనులు మొదలు పెట్టారని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్​లో లేని పనులు చేసేందుకు ఈవో అనుమతులిచ్చారని నివేదికలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'సింహగిరిపై పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే'

Last Updated : Jun 3, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.