విశాఖ జిల్లా భీమునిపట్నంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన భూములలో ఆక్రమణలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి పర్యవేక్షణలో తొలగించారు. సుమారు 2 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని రెవెన్యూ, జీవీఎమ్సీ అధికారులు అధ్వర్యంలో పోలీసు బందోబస్తుతో ఆక్రమణలను తీసేశారు. అనంతరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శాంతి హెచ్చరించారు. ఆక్రమణల తొలగింపులో ఎసీపీ రవి శంకర్ రెడ్డి, జీవీఎంసీ భీమునిపట్నం జోనల్ కమిషనర్ గోవిందరావు, తహసీల్దార్ కెవీ.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. ఎస్పీ బాలు మృతి పట్ల ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం సంతాపం