ETV Bharat / state

విశాఖలో రిజిస్ట్రేషన్లకు మళ్లీ సాంకేతిక సమస్య - విశాఖలో భూముల రిజిస్ట్రేషన్​లో సాంకేతిక సమస్య వార్తలు

విశాఖలో రిజిస్ట్రేషన్లకు సాంకేతిక ఇబ్బంది తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్ అవడం వల్ల రెండు రోజులుగా రిజిస్ట్రేషన్​దార్లకు పెద్దఎత్తున సమస్యలు ఎదురవుతున్నాయి.

విశాఖలో రిజిస్ట్రేషన్లకు మళ్లీ సాంకేతిక సమస్య

author img

By

Published : Nov 12, 2020, 7:38 PM IST

విశాఖ జిల్లాలో ఎనిమిది రిజిస్ట్రేషన్ కార్యాలయాలల్లో నిన్న(బుధవారం) ఒక్కరోజే దాదాపు 300కి పైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ కావాల్సి ఉంది. వాటిల్లో కేవలం పది శాతం లోపుగానే రిజిస్టర్ కావడం పట్ల వినియోగదార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు(గురువారం) సర్వర్లు కొంత మెరుగుపడినట్టు ఉన్నా వేగంగా మాత్రం సాగడం లేదు. మరో వైపు రిజిస్ట్రేషన్ల కోసం మంచి రోజులు చూసుకుని వచ్చే వారికి ఇప్పుడు సాంకేతిక ఇబ్బందుల వల్ల వాయిదా పడడం చికాకు కలిగిస్తోంది. పెద్ద సంఖ్యలోనే రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్​దార్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విశాఖలో దసరా తర్వాత రిజిస్ట్రేషన్ల సంఖ్య జోరందుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పుంజుకుంటున్న తరుణంలో ఈ రకంగా సాంకేతిక ఇబ్బంది ఇప్పుడు సమస్యకు కారణమవుతోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్రస్థాయిలో దిద్దుబాటు చర్యలు ఆరంభించారని నెమ్మదిగా సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.