విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని రెడ్డి వారి వీధిలో రెడ్ జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ వీధికి హైదరాబాద్ నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని రెడ్డి వారి వీధితోపాటు... అన్నివైపులా సుమారు 200 మీటర్ల దూరం వరకు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. మరోపక్క వైద్య శిబిరం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: 'తక్షణమే ఇక్కడి మద్యం దుకాణాన్ని తరలించండి'