ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీలు గర్జించడంతో సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ఏవోబీలోకి వచ్చిన సమాచారంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇది జరిగిన పక్షం రోజుల్లో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే మావోయిస్టు అగ్ర నాయకత్వం కదలికలు మాత్రం ఏఓబిలోనే ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు అయితే విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కలహండి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందడంతో ఏబిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లను ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తం చేశాయి. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మంగళవారం మన్యంలో పోలీసుల లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటుచేసిన మందుపాతరలను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేసిన సంఘటన ఒక్క రోజు గడవకముందే... ఏఓబిలో ఎదురు కాల్పులు జరగడంతో గిరి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: