రొమ్ము కాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు విశాఖ జిల్లాలో ర్యాలీ జరిగింది. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల కాన్సర్ నయం చేసుకునే అవకాశం ఉంటుందని సంస్థ అధ్యక్షురాలు డా.షిరీన్ రెహ్మాన్ అన్నారు.
వైద్యులు సూచించిన లక్షణాలను స్వయంగా మహిళలే పసిగట్టవచ్చని చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డా.షిరీన్ రెహ్మాన్ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో త్వరగా చికిత్స అందించి మహిళ జీవితకాలం పెంచవచ్చని చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో బ్రెస్ట్ కాన్సర్ బాధితులు తక్కువగా ఉన్నప్పటికీ అవగాహనా లోపం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఏఎన్ఎమ్, ఆశావర్కర్లకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: