విశాఖ జిల్లా అనకాపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో.. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికిి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఐఆర్ గంగాధర్ అన్నారు. పార్టీ నాయకులు దాసరి సంతోష్, గౌరీపట్నపు గున్న బాబు పాల్గొన్నారు.