కొద్ది రోజులుగా వడగాడ్పులతో విలవిల్లాడుతున్న విశాఖ వాసులు.. ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవగా.. చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. రావికమతం మండలం కొత్తకోట, రోలుగుంట, కంచు బొమ్మల, భోగాపురం, నిండుకొండ, నాయుడుపాలెం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
కొద్ది రోజులుగా వడగాడ్పులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కొంత వరకు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. మరోవైపు.. ఈదురు గాలులు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. పలు ప్రాంతాల్లో పూత దశలో ఉన్న మామిడి.. గాలులకు ప్రభావితమైంది. కాయలు నేల రాలిపోవటంపై.. రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అకాల వర్షాలతో నష్టం తప్పేలా లేదని ఆవేదన చెందారు.
ఇవీ చూడండి: