Childrens: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి 25 మంది పిల్లల్ని రైలులో అక్రమంగా తరలిస్తుండగా విశాఖ ఆర్పీఎఫ్, జీఆర్పీ సహకారంతో రైల్వే చైల్డ్ లైన్ సిబ్బంది అడ్డుకున్నారు. ముజఫర్‌పూర్ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్తున్న రైలులో శ్రీకాకుళం రైల్వేస్టేషన్ నుంచి 25 మంది పిల్లల్ని బెంగళూరుకు తరలిస్తున్నారనే సమాచారం చైల్డ్ లైన్ సిబ్బందికి అందింది. రైలు విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఆర్పీఎఫ్, జీఆర్పీ, చైల్డ్ లైన్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 25 మంది బాలలను, వారిని తీసుకెళ్తున్న వ్యక్తిని రైలు నుంచి దించి విచారించారు. ఆ వ్యక్తి నుంచి పూర్తి సమాచారం రాకపోవడంతో ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తి వద్ద పిల్లలకు సంబంధించిన ఆధారాలు, అనుమతి పత్రాలు లేకపోవడంతో గవర్నమెంట్ బాలల గృహానికి తరలించినట్లు చైల్డ్ లైన్ ప్రతినిధులు తెలిపారు. ఒకేసారి 25 మంది చిన్నారులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు వివరించారు.
రంగంలోకి దిగిన ముస్లిం పెద్దలు..: బాలల్ని అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలుసుకున్న స్థానిక ముస్లిం పెద్దలు విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. వారంతా మదార్సలో చదువుకునేందుకు వెళ్తున్నారని.. వారిని అడ్డుకుని ప్రయాణానికి ఆటంకం కలిగించడం దారుణమని అన్నారు.
ఇవీ చదవండి: