ప‌్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తూర్పు కోస్తా రైల్వే 12 రైళ్లను మార్చి అఖరు వరకు పొడిగించాలని నిర్ణయించింది. భువనేశ్వర్- తిరుపతి ప్రత్యేక ఎక్స్ప్రెస్.. ప్రతి శనివారం సాయంత్రం బయల్దేరే రైలును మార్చి 27 వరకు కొనసాగిస్తారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ కూడా మార్చి 28 వరకు తిరుగుతుంది. భువనేశ్వర్- చెన్నయ్ వీక్లిని మార్చి 25 వరకు చెన్నయ్-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ను మార్చి 26 వరకు నడుపుతారు. భువనేశ్వర్ - బెంగళూర్ కంటోన్మెంట్ ప్రతి శనివారం మార్చి 28 వరకు, బెంగళూరు కంటోన్మెంట్- భువనేశ్వర్ మార్చి 29 వరకు నడపనున్నారు.
భువనేశ్వర్-పుదుచ్చేరి వీక్లీ ప్రతి మంగళవారం మార్చి 30 వరకు నడుస్తుంది. పుదుచ్చేరి-భువనేశ్వర్ మార్చి 31వరకు నడుపుతారు. భువనేశ్వర్-రామేశ్వరం వీక్లీ మార్చి 26 వరకు, తిరుగు ప్రయాణంలో మార్చి 28న రామేశ్వరంలో బయలుదేరుతుంది. పూరీ చెన్నయ్ సెంట్రల్ వీక్లీ రైలు మార్చి 28 వరకు, చెన్నయ్ నుంచి అదే నెల 29న బయలు దేరుతుందని అధికారులు తెలిపారు.
విశాఖ -నిజాముద్దీన్ వారానికి రెండుసార్లు నడిచే ఎక్స్ప్రెస్ మార్చి 29 వరకు, నిజాముద్దీన్- విశాఖ బైవీక్లీని మార్చి 31వరకు నడుపుతారు. విశాఖ-నిజాముద్దీన్ వీక్లీ ఎక్స్ప్రెస్ మార్చి 31 వరకు నడుస్తుంది. తిరుగుప్రయాణంలో నడిచే రైలు ఏప్రిల్ రెండో తేదీ వరకు నడవనుంది.
విశాఖ-చెన్నయ్ వీక్లీ రైలు.. మార్చి 29 వరకు, తిరుగు ప్రయాణంలో మార్చి 30 వరకు పొడిగించారు. విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్.. రాయగడ మీదుగా మార్చి 28 వరకు, తిరుగు ప్రయాణంలో మార్చి 30వరకు తిప్పుతారు. విశాఖ-గాంధీ ధామ్ వీక్లీ మార్చి 25వరకు, తిరుగుప్రయాణంలో మార్చి 28 వరకు ఈ రైలు నడుస్తుంది.
విశాఖ-కడప రోజు వారీ ఎక్స్ప్రెస్ మార్చి 31 వరకు, కడప-విశాఖ మధ్య ఏప్రిల్ ఒకటి వరకు నడుస్తాయి. విశాఖ - లింగంపల్లి డెయిలీ స్పెషల్ కూడా ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: