ETV Bharat / state

మన్యాన్ని చుట్టు ముట్టిన మహమ్మారి.. క్వారంటైన్​ కేంద్రాలు లేక ఇబ్బందులు

విశాఖ మన్యం పాడేరులో కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు కొవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తుంటే.. పీహెచ్​సీల్లో క్వారంటైన్ సెంటర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పరికరాలు ఉన్నప్పటికీ.. వైద్యులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి.

Quarantine centers not avialable
క్వారంటైన్ కేంద్రాలు లేక రోగుల అవస్థలు
author img

By

Published : Apr 28, 2021, 12:51 PM IST

Updated : Apr 28, 2021, 3:26 PM IST

విశాఖ మన్యంలో పాడేరు మినహా వేరేచోట క్వారంటైన్ సెంటర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజులుగా పాడేరులో పది మంది వరకు కొవిడ్ కారణంగా మృత్యువాతపడ్డారు. కరోనా పరీక్షల ఫలితాలు రావడానికి ఐదు రోజులు సమయం పడుతుండటం.. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అధికారులు కొవిడ్ నియంత్రణకు వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటికీ సరైన సదుపాయాలు లేక అంతంతమాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్​సీల్లో క్వారంటైన్ సెంటర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల పరికరాలు ఉన్నప్పటికీ.. వైద్యులు లేక నిరుపయోగంగా మారుతున్నాయి.

క్వారంటైన్ కేంద్రాలు లేక రోగుల అవస్థలు

క్వారంటైన్ కేంద్రాలు లేక రోగుల అవస్థలు..

విశాఖ మన్యంలో కరోనా క్వారంటైన్ కేంద్రాలు లేక.. కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు. చింతపల్లి మండలం లోతుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వ్యక్తి క్వారంటైన్‌ కేంద్రాలు లేక, ఇంటికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. మందులతో కూడిన కిట్‌ ఇచ్చి ఇంటికి వెళ్లిపోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం మారుమూల గ్రామం కావటం.. ఫోన్ సదుపాయం కూడా లేదని.. ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారని యువకుడు ప్రశ్నించాడు.

ఇవీ చూడండి...

కొవిడ్ ఎఫెక్ట్: రాత్రివేళ బయటికొస్తే కేసులే!

Last Updated : Apr 28, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.