ETV Bharat / state

జలశయాలు నిండుగా.. నీటి విడుదల ముందుగా..!

author img

By

Published : May 8, 2021, 10:16 AM IST

ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు ప్రారంభానికి అవసరమైన నీటి నిల్వలు పలు జలాశయాల్లో పుష్కలంగా ఉన్నాయి. రైతులు కోరితే ముందుగానే నీటిని విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. అన్నదాతలు ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 15 తర్వాత సమావేశం కావాలని నిర్ణయించారు.

'జలశయాలు నిండుగా .. సాగుపై త్వరలో రైతులతో సమావేశం'

రానున్న ఖరీఫ్ పంట సాగుకు జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున రైతులతో అధికారులు సమావేశమయ్యేందుకు యోచిస్తున్నారు. విశాఖ జిల్లా తాండవ జలాశయం ఆయకట్టు కింద విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలతో కలిపి సుమారు 52 వేల ఎకరాలు సాగు అవుతోంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా ఇటీవలే అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు 377 అడుగులకు చేరుకుంది. ఖరీఫ్ సీజన్​కు కావాల్సిన నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే సుమారు 80 రోజుల వరకు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. అప్పుడప్పుడు కురిసే వర్షాలతో కలిపితే ఖరీఫ్ గట్టెక్కవచ్చని భావిస్తున్నారు.

ముందుగానే గట్టెక్కాలంటే..

సాధారణంగా ఖరీఫ్ సీజన్​కు సంబంధించి ఏటా ఆగస్ట్ రెండో వారంలో నీటిని విడుదల చేస్తుంటారు. నవంబర్, డిసెంబర్లలో అనుకోకుండా తుఫాన్లు వస్తే రైతులు నష్టపోతుంటారు. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే నాట్లు ముందుగానే మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులు సూచిస్తున్నారు. జూన్​లో వరి నాట్లు వేస్తే సెప్టెంబర్ నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు.

త్వరలోనే సమావేశమై..

జూన్ నెలలో నాట్లు వేయాలంటే నెల రోజులు ముందుగానే వరి నారు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా ఈ నెల రెండో వారంలో తాండవ జలాశయం పరిధిలోని ఆయకట్టుదారులు.. జలాశయం పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు.

ఇవీ చూడండి:

తమిళనాడులో పూర్తిస్థాయి లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.