ETV Bharat / state

వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి... రైతును ఆదుకోండి - ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్

వ్యవసాయ బిల్లులపై మోదీ సర్కారు తీరును నిరసిస్తూ విశాఖలో పూర్ణమార్కెట్ వద్ద పండా వీధిలో ఐద్వా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తన తీరును మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి... రైతును ఆదుకోండి
వ్యవసాయ చట్టాలను రద్దు చేయంవ్యవసాయ చట్టాలను రద్దు చేయండి... రైతును ఆదుకోండిడి... రైతును ఆదుకోండి
author img

By

Published : Dec 14, 2020, 10:44 PM IST

రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విశాఖలో ఐద్వా(ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్) మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రైతుకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వం 3 చట్టాలు తీసుకురావటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరు పూర్తిగా కార్పొరేట్ల దోపిడీకి ద్వారాలు తెరిచి రైతుల కడుపు కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో ఐద్వా మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన

భవిష్యత్​లో రైతు మనుగడ ఉండదని 130 కోట్ల జనాభాకు ఆహారం అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆహారం కోసం విదేశీయులపై ఆధారపడాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా పూర్ణమార్కెట్ వద్ద పండా వీధిలో ఐద్వా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తన తీరును మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. రైతులకు ఉరిగా మారిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని నినదించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు.

కలుగొట్లలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.