ETV Bharat / state

'జూత్తాడ నిందితుడిని కఠినంగా శిక్షించాలి' - Telugu Yadava Mahasabha Representatives news

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యాదవ మహాసభ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

protest by  Telugu Yadava Mahasabha Representatives
తెలుగు యాదవ మహాసభ ప్రతినిధుల ఆందోళన
author img

By

Published : Apr 22, 2021, 4:42 PM IST

విశాఖలో తెలుగు యాదవ మహాసభ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. పెందుర్తి మండలం జుత్తాడలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చిన కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. హత్యలు జరిగి వారం రోజులు గడుస్తున్నా సీఎం, మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం బాధాకరమన్నారు. నిందితుడు జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని.. వెంటనే అతడిని ఉరితీసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: కరోనా : అనుమానంతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.