విశాఖ ఉక్కు కర్మాగారం, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని.. విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ అంశాన్ని నిలుపుదల చేయకుంటే.. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగా.. విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
'కేంద్ర ప్రభుత్వ తీరు దుర్మార్గం'
రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గమని అప్పలరాజు అన్నారు. ప్రజల సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను.. ప్రధాని మోదీ, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు నెలల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి:
జూవారీ సిమెంట్ మూసివేత ఆదేశాలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు