విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'విశ్వాస్ ఘాత్ దివాస్' పేరిట నోట్లు రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ చేపట్టారు. సోషల్ మీడియాలో స్పీక్ అప్ పేరిట నోట్ల రద్దు వలన కలిగిన నష్టాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. కరోనా కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఎంతోమంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారని నిరసన చేశారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధంగా నిరంకుశత్వంతో ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రెండు కోట్ల సంతకాల కార్యక్రమాన్ని చేశారు. ఆదివారం రామకృష్ణ జంక్షన్లో రైతుబజార్లో నగర కాంగ్రెస్, దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, ఏఐసీసీ సభ్యురాలు రమణి కుమారిలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...