దళిత, ఆదివాసీ, మైనారిటీ ఉద్యమాలకు.. ఆచార్య కేపీ సుబ్బారావు మరణం తీరని లోటని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు అన్నారు. హక్కుల ఉద్యమకారుడు సుబ్బారావు సంతాప సభ విశాఖలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించారు. మనువాద వ్యతిరేక పోరాట యోధునిగా, విప్లవ సాంస్కృతిక ఉద్యమ కళాకారునిగా, హక్కుల ఉద్యమ కార్యకర్తగా సుబ్బారావు ఎనలేని సేవలందించారని చిట్టిబాబు కొనియాడారు.
తుది శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు, హక్కుల ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన మహోన్నతుడు కె.పి సుబ్బారావు అని.. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి నేతలు, మేధావులపై.. తీవ్ర నిర్బందాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన ఆగ్రహించారు.
ఇదీ చదవండి: