గురజాడ అప్పారావు 157వ జయంతి వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని టీఎస్ ఆర్ కాంప్లెక్స్ లోని గురజాడ విగ్రహానికి లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. కవితల్లోని శైలీ, వాస్తవీకతతోనే గురజాడను నేటి తరం కూడా గుర్తు చేసుకుంటుందని యార్లగడ్డ అన్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి ఐక్యతకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అధైర్యపడొద్దు... అండగా ఉంటాం: చినరాజప్ప