ETV Bharat / state

శ్రీ ప్రేమ సమాజం.. విలువైన ఆస్తులు సొంతం

ద‌శాబ్దాలుగా స్వ‌చ్ఛంద క‌మిటీతో న‌డుస్తున్న విశాఖ‌లోని శ్రీ‌ ప్రేమ‌స‌మాజం ఇప్పుడు దేవాదాయ శాఖ ప‌రిధిలోకి చేరింది. అనాథలు, వృద్థులు, మ‌హిళ‌లకు అండ‌గా సేవ‌లందిస్తున్న ఈ స్వ‌చ్ఛంద సంస్థలో ఆడిటింగ్​లో బ‌య‌ట‌ప‌డ్డ లోపాల‌పై ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందాయి. విచార‌ణ నిర్వ‌హించిన దేవాదాయ శాఖ నివేదిక‌పై ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసి ఆ శాఖను అధీనంలోకి తీసుకువ‌చ్చింది.

prama samajam hand over to endowrsement department
డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజం ప్రధాన భవనం
author img

By

Published : Oct 5, 2020, 11:59 AM IST

prama samajam hand over to endowrsement department
వ్యవస్థాపకులు మారెడ్ల సత్యనారాయణ దంపతులు

విశాఖ న‌గ‌రంలోని న‌డిబొడ్డున ఉన్న శ్రీ ప్రేమ‌స‌మాజం స్వ‌చ్ఛంద సంస్థ ద‌శాబ్దాలుగా అనాథల‌ను చేర‌దీయ‌డం, వృద్థులకు ఆశ్ర‌యం క‌ల్పించ‌డం, ఒంట‌రి మ‌హిళ‌ల‌ను ఆదుకోవ‌డం, బాలిక‌ల‌ను చ‌దివించ‌డం వంటి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వ‌మే 1930లో ఏర్పాటైన ఈ సంస్ధ దాత‌ల సాయంతో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. మారెడ్ల స‌త్య‌నారాయ‌ణ దీనిని స్ధాపించ‌గా 1941లో దీనిని ట్ర‌స్టుగా రిజిస్ట‌ర్ చేశారు. కంచ‌ర్ల రామ‌బ్ర‌హ్మం దీనికి 1941-46 మ‌ధ్య అధ్య‌క్షునిగా ప‌ని చేశారు. ఆయ‌న మ‌నవడు కంచ‌ర్ల రామ‌బ్ర‌హ్మం ప్ర‌స్తుతం దీని అధ్య‌క్షునిగా ఉన్నారు. ఈ సంస్ధ సేవా కార్య‌క్ర‌మాల‌ ప‌ట్ల ఆక‌ర్షితులైన దాత‌లు విరాళాల రూపంలో స్ధిరాస్తుల‌ను స‌మ‌కూర్చారు.

2007లోనే విచారణ

ప్రేమ‌స‌మాజం కోసం ఇచ్చిన ఆస్తుల‌లో రుషికొండ‌లో చెరువు ప్ర‌సాద‌రావు అనే దాత 1959లో 47.36 ఎక‌రాల భూమిని ఇచ్చారు. దీనిని 2004లో 33 ఎక‌రాల‌ను 33 ఏళ్ల లీజుకు ఒక వ్య‌క్తికి క‌ట్ట‌బెట్టారు. దీనిపై 2007లో దేవాదాయ శాఖకు వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ విచార‌ణ చేప‌ట్టి ప‌లు లోపాల‌ను ప్ర‌భుత్వానికి నివేదించారు. తాజాగా శంక‌ర్ అనే వ్య‌క్తి ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేయ‌డం ప్ర‌భుత్వం వెంట‌నే దీనిపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతిని మ‌రో మారు నివేదిక కొరింది. ఈ లీజులో విధానాలు పాటించ‌క‌పోవ‌డమే కాకుండా మ‌రికొన్ని ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తించి ప్ర‌భుత్వానికి నివేదించారు. రెండు రోజుల క్రిత‌మే ప్ర‌భుత్వం ప్రేమ‌స‌మాజానికి ఇచ్చిన ప‌లు వెసులుబాట్ల‌ను ర‌ద్దు చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది.

రూ.వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తి:

డాబా గార్డెన్స్ లోని శ్రీ ప్రేమ‌స‌మాజం ప్ర‌ధాన కార్యాల‌య ప్రాంగ‌ణం ఎక‌రా 88 సెంట్లు ఉంది. ఇందులో వృద్థ శ‌ర‌ణాలయం, గోశాల‌, అనాథ బాల‌ల కేంద్రం న‌డుస్తున్నాయి. వృత్తి శిక్ష‌ణా కేంద్రం, ప్రాథమిక పాఠ‌శాల, ప్రాథమిక ఆసుప‌త్రి కూడా ఇందులో నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం 67 మంది వృద్ధులు, 15 మంది బాల‌లు ఉన్నారు. ఇద్ద‌రు మేనేజ‌ర్లు 17 మంది సిబ్బంది ఉన్నారు.

ఫిక్స్ డ్ డిపాజిట్లు దాదాపు రెండు కోట్ల‌పైచిలుకే ఉన్నాయి. స్థిరాస్తులు అన్నీ వంద‌ల కోట్ల రూపాయిల ఆస్తులు కావ‌డం విశేషం. చెంగ‌ల్రావుపేట‌లో 2148 గ‌జాల స్ధ‌లంలో లెప్ర‌సీ కేంద్రం, సోల్జ‌ర్ పేట‌లో 380 గ‌జాల స్థలం ఉన్నాయి. రుషికోండ‌లో 47.33 ఎక‌రాల స్ధ‌లంలో 33 ఎక‌రాల స్ధ‌లం లీజుకుపోగా , మ‌రికొంత స్థలం స‌ముద్ర కోత‌లో పొయింది. పేద‌ల ఆవాసాలుగా కొంత స్థలం ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైంది. భీమిలిలో 60 గ‌జాలు, మరో చోట 23సెంట్ల స్థలం ఉంది. చొడ‌వ‌రంలో దాదాపు ఆరున్నర ఎక‌రాల భూమి ఉంది. శ్రీ‌కాకుళం గుజ‌రాతీపేట‌లో 61సెంట్లు, న‌ర‌స‌న్న‌పేట‌లో 21 సెంట్లు, విజ‌య‌న‌గ‌రం జిల్లా జామిలో 19.48సెంట్ల స్థలం ఉంది.

సేవలు కొనసాగుతాయి

ప్రస్తుతం ప్రేమ సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తాం. వృద్ధులు, అనాథ పిల్లల ఆశ్రమాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తాం. ఈ సంస్థ కింద ప్రస్తుతం అందుతున్న సేవా కార్యక్రమాలను విస్తరించి, మరింత మెరుగ్గా నిర్వహిస్తాం. ప్రస్తుతానికి పనిచేస్తున్న వారంతా కొనసాగుతారు. - కె.శిరీష, ఈవో, ప్రేమసమాజం

ఇదీ చదవండి: రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.