పంచాయతీరాజ్ ఇంజినీర్లపై ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేపడుతోందంటూ... ఏపీపీఆర్ ఇంజినీరింగ్ ఐకాస ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. విశాఖ జిల్లాలో ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, పాడేరు డివిజన్ల వారీగా పీఆర్ ఇంజినీర్లంతాా కార్యాలయాలకు తాళాలు వేసి నిరసనలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై ఈ ప్రభుత్వం నాణ్యత పరీక్షలు చేయడం, ఇంజినీరింగ్ అధికారులను బాధ్యులను చేయాలనుకోవడం సరికాదన్నారు.
నాణ్యత బాగో లేకుంటే దానికి విజిలెన్స్ అనే పద్ధతి ఉంటుందే తప్ప అధికారుల వ్యక్తిగత ఉద్యోగ సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఇంజినీర్లపై చర్యల దస్త్రాన్ని ఉపసంహరించుకునే వరకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఐకాస నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: