విశాఖ ఏజెన్సీలో గంజాయి ద్రావణం, ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొడ్డపుట్టులోని గెమ్మెలి చిన్నారావు అనే ఆసామి ఇంట్లో దాడులు చేసిన పోలీసులు.. నిల్వ చేసిన 41 కేజీల గంజాయి ద్రావణం, 240 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారావును అరెస్టు చేశారు. గంజాయి ద్రావణం విలువ సుమారు రూ. 20 లక్షలు, ఎండు గంజాయి విలువ సుమారు రూ. 3 లక్షల 50 వేలు ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: