అనకాపల్లిలో 220 కిలోల గంజాయి పట్టివేత - police take over cannabis at anakapalli
విశాఖ ఏజెన్సీ నుంచి దిల్లీకి తరలిస్తున్న 220 కిలోల గంజాయిని అనకాపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పేట్టారు. అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద నిందితులను పట్టుకున్నారు. దిల్లీకి చెందిన రాజ్బీర్, సురేష్లాల్ను అదుపులోకి తీసుకున్నారు. రాజ్బీర్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నామని అనకాపల్లి ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర తెలిపారు.