ETV Bharat / state

వీఆర్పీపై ఎస్​ఐ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడి

author img

By

Published : Jun 23, 2020, 9:32 PM IST

ఉపాధి హామీ పథకం వీఆర్పీపై ఎస్​ఐ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ.. విశాఖ జిల్లా ఏ.కోడూరు గ్రామస్థులు పోలీస్ స్టేషన్​ను ముట్టడించారు. స్టేషన్ ముందు బైఠాయించి సదరు ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐ కల్పించుకుని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో వివాదం సద్దుమణిగింది.

police station obsession in koduru vizag district
వీఆర్పీపై ఎస్​ఐ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడి

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వీఆర్పీ సింహాచలం నాయుడిపై ఎస్​ఐ చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ గ్రామస్థులు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే వీఆర్పీ సింహాచలం నాయుడు భూమి సరిహద్దు తగాదా సమస్య గురించి ఆదివారం పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్​ఐ సతీష్ తనపై చేయి చేసుకున్నాడని చెప్పారు. దీనిపై సీఐ ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం వీఆర్పీకి మద్దతుగా గ్రామస్థులు, వైకాపా శ్రేణులు స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఐ ఈశ్వరరావు స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో పరిస్థితి చక్కబడింది.

ఇవీ చదవండి..

భారత్​లో ప్రతీ లక్షమందికి ఒక్కటే కరోనా మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.