విశాఖ మన్యంలో నాటుసారా ఏరులై పారుతుంది. ఎక్సైజ్ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా సారా తయారీని నిలువరించలేకపోతున్నారు. ముఖ్యంగా కొయ్యూరు. జి.మాడుగుల, చింతపల్లి , జీకే వీధి మండలాల్లో మారుమూల ప్రాంతాలలో నాటు సారా తయారీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. మరోపక్క ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా దాడులు చేస్తూ బెల్లం ఊటలను, నాటు సారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు, అయినప్పటికీ మద్యం తాగేవారు, మద్యం తయారు చేసేవారు ఎంత మాత్రం మారడం లేదు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలో కుమ్మరు అంచుల గడ్డవాగు దగ్గర నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకు ఉపయోగించే 15 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేేశారు. 20 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి